శ్రీకాకుళం జిల్లా, మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ముందుగా మూలపేట తీరం వద్ద గంగమ్మ తల్లికి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.4,362 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తుల నిర్మాణం జరగనుంది. 30 నెలల్లో పోర్టు నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విష్ణుచక్రం, మూలపేటకు చెందిన 594 మంది నిర్వాసిత కుటుంబాలకు పునరావాసానికి రూ.109 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీలను నిర్మిస్తోంది.