రాష్ట్ర విభజనకు సంబంధించిన మూడు, నాలుగు అంశాలు కొలిక్కి వచ్చాయని, అయితే సాంకేతిక కారణాలతో ఆగిన ప్రధాన సమస్యలపై కేంద్ర కార్యదర్శులతో మరోసారి చర్చించేందుకు తనతో సహా వివిధ శాఖల అధికారుల బృందం బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. కేంద్ర కార్యదర్శులతో భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఉందని..ఢిల్లీ పర్యటన కోసమే సీఎం జగన్ లండన్ పర్యటన వాయిదా వేసుకున్నారని తెలిపారు. విభజన సమస్యలపై నిర్ణయాలు తీసుకునేవారిని ఆయన అక్కడ కలుస్తారని చెప్పారు.