బీహార్ భాగల్ పుర్ రైల్వే స్టేషన్ లోని టీవీ స్క్రీన్ పై సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అసభ్య సందేశం ప్రత్యక్షమైంది. 5 నుంచి 10 నిమిషాలు ప్రసారమైన ఈ సమాచారాన్ని కొంతమంది తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ప్రసారాలు వెంటనే నిలిపేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, గత మార్చిలో పాట్నా స్టేషన్ లో టీవీ తెరలపై పోర్న్ చిత్రం ప్రసారమైంది.