చంచల్గూడ జైలులో ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం 9 గంటల నుంచి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఇద్దరినీ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారించాల్సి ఉంది. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో కలకలం రేగింది. అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచే సమయంలో కూడా బీపీ పెరిగింది. భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో సీబీఐ అధికారుల్లో ఆయనను విచారించే విషయంపై సందిగ్ధత చోటు చేసుకుంది.