అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఈనెల 23న ప్రవేశ పరీక్షలు జరుగుతాయని చిత్తూరు డీఆర్వో రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ఐదో తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశపరీక్షకు ఏడు పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్షలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, జూనియర్ ఇంటర్‌కు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రామకుప్పం, చిత్తూరు, పలమనేరు, కుప్పం, జీడీనెల్లూరు, పూతలపట్టు, విజలాపురంలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకులంలో ప్రవేశాలకోసం ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీవైఈవో చంద్రశేఖర్, ఎస్పీడీసీఎల్ డీఈఈ శేషాద్రిరెడ్డి, ఆర్బీఎ్‌సకే సుదర్శన్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa