అనంతపురం జాతీయ రహదారి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ మేరకు అనంతపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అధిగమించే క్రమంలో మరో ద్విచక్ర వాహనదారుడు వాహనం అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అప్రమత్తం కావడంతో ప్రాణహాని తప్పింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు ప్రమాదంలో గాయపడ్డ రమణ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa