వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఈరోజు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది.విచారణలో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఉదయ్, భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అవినాష్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.రేపు 10.30కి మళ్లీ రావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో ఉదయ్, భాస్కర్ రెడ్డిల విచారణ పూర్తికావడంతో అధికారులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.