సినిమా పైరసీపై పోరాటాన్ని పటిష్టం చేసేందుకు, వయసు ఆధారంగా సినిమా వర్గీకరణను తీసుకురావడానికి సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇంటర్నెట్లో పైరేటెడ్ సినిమా కంటెంట్‌ను ప్రసారం చేయడాన్ని నిరోధించే నిబంధనలతో కూడిన సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు 2023కి ఆమోదం లభించింది.