వేసవి కాలం రావడంతో పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతన్నాయి. తాాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దాదాపు రెండు కిలోమీటర్లు మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు హుబ్లీ ఇండస్ట్రీయల్ పార్క్‌లోని ఓ ప్రైవేటు గోదాంలో ఈ ఘటన జరిగింది. దీంట్లో క్రాకరీ ఫ్యాక్టరీ ని నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
గోదాంలో కోట్లాది రూపాయలు విలువ చేసే బాణాసంచా నిల్వ ఉంచారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలకు బాణాసంచా పేలడంతో.. మంటలు మరింత వ్యాపించాయి. బాణాసంచా పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి.. ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa