విశాఖ గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరి గంగపుత్రులతో కిటకిటలాడింది. ఒరిస్సా , భువనేశ్వర్, తదితర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గంగపుత్రులతో వరాహ పుష్కరిణి రద్దీ గ మారింది. ఈమేరకు గురువారం గరిడీలతో అప్పన్న స్వామిని కీర్తించుకుంటూ మెట్ల మార్గం నుండి గంగ పుత్రులు సింహగిరి కి చేరుకున్నారు.