ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది జీతాలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికారులు రెమ్యూనరేషన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. పేపర్ సెట్టర్‌కు ఒక్కోపేపర్కి గానూ రూ.1320, అనువాదకులకు రూ.1155, జిల్లా స్థాయి పరిశీలకుడికి రూ.300, క్యాంప్ ఆఫీసర్‌కు రూ.578 చెల్లించనున్నారు.