గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో స్టాఫ్ స్పీడ్ సంస్థ వారి ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ రాజకుమారి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు వైస్సార్సీపీ నాయకురాలు నూరిఫాతిమా, మాజీ మిర్చియార్డు వైస్ ఛైర్మన్ శృంగారపు శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.