ఐరాల మండలం , కాణిపాకం జనసేన పార్టీ సమావేశం ఎమ్మెస్ రెసిడెన్సిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ ఏకే శరవణ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా చిరంజీవి యువత మాట్లాడుతూ పార్లమెంటు పూతలపట్టు నియోజకవర్గం స్థాయిలో పర్యటించి పార్టీలోకి ఆహ్వానించడం, బూత్ కమిటీలు నియమించటం, క్షేత్ర స్థాయి పర్యటించి పార్టీని బలోపేతం చేయటం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ని 2024లో ముఖ్యమంత్రిగా చేయటమే మా ధ్యేయంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.