రాష్ట్ర ప్రభుత్వం అత్యంతప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేప్రక్రియను వేగవంతంగా చేయాలని మరియు గృహనిర్మాణాల పురోగతిలో రోజువారి ప్రగతి ఉండాలని స్పందన అర్జీలకు సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు మంజూరు చేయాలని 100 శాతం పనిదినాలు కల్పించాలనిప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రీ సర్వే, స్పందన, జాతీయ రహదారులు, వ్యవసాయ శాఖ కు సంబంధించి చిరు ధాన్యాల సాగు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇండ్ల పురోగతి జగనన్న లేఔట్లలో మౌలిక వసతుల కల్పన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వామిత్వ, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు.