చిత్తూరు జిల్లా లో ఉపాధి అవకాశాల పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం లో డిఆర్డిఏ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, నెహ్రూ యువకేంద్రం, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా ఉపాధికల్పనకు సంబంధించి తీసుకున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షనిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ టి ఐ, డిగ్రీకోర్సులు పూర్తి చేసుకున్న వారికి అవసరమైన నైపుణ్యాల పెంపు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం నిర్వహిస్తున్న టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సులు నిర్వహణ తో ఉపాధి కల్పన కు కృషి చేయాలన్నారు.