రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ ఉందని, వాటిని సరిదిద్దుకోడానికి మరోసారి చంద్రబాబును సీఎంగా ఎన్నుకోవాలి’’ అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ‘‘మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి అన్నింటికీ తిలోదకాలిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి. ఆస్తి, ప్రాణ, మాన రక్షణ లేదు. పౌర హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగ హక్కులను తుంగలోకి తొక్కుతున్నారు. ఫ్యాక్షనిస్టుకు రాజ్యాధికారం తోడయితే ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉంటాయో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. ఫలితంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అయినా కూడా సీఎం జగన్ మళ్లీ ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి స్కీము ఒక స్కామ్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే చంద్రబాబును మళ్లీ సీఎంగా ఎన్నుకోకపోతే రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్లమవుతాం’’ అని ఎంపీ స్పష్టం చేశారు.