టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆదోని టౌన్లోకి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఆదోని టౌన్లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. పన్నుల భారంతో బతుకు భారంగా మారిందని లోకేష్‌కు మహిళలు తమ బాధను చెప్పుకున్నారు. ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మహిళలకు లోకేష్ అభయమిచ్చారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతకు లోకేష్ హామీ ఇచ్చారు.