రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గరిమెకలపల్లి గ్రామంలో ఈనెల 29వ నుంచి మే5 వరకు జరగనున్న శ్రీ నరసింహ స్వామి, శ్రీ వీర ఓబమ్మ దేవి పూజ మహోత్సవాలకు హాజరు కావాలని మాజీమంత్రి పరిటాల సునీతను గ్రామస్తులు శుక్రవారం ఆహ్వానించారు. వెంకటాపురంలోని మాజీమంత్రి నివాసంలో మార్యద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.