యువగలం పాదయాత్రలో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ‘‘ఈఎస్ఐ స్కాంపై చర్చకు సిద్ధం అంటున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో స్కాంకి పాల్పడి మీరు బెంజ్ కారు గిఫ్ట్‌గా తీసుకున్నారని ఆధారాలతో సహా ఎన్నో సార్లు బయటపెట్టాం. అదే కారులో మీ ముద్దుల కుమారుడు షికార్లు కొట్టడం రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఏమి తెలియనట్లు ఈఎస్ఐ స్కాంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వంలో ఉంది మీరు అనే విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి. బెంజ్ మంత్రి గారూ మీ ఆవు కథలు ఆపండి. నేను నా సవాల్‌కి కట్టుబడి ఉన్నాను. ఎవరైనా ముందుకొస్తే భూములు రైతుల పేరిట రాయడానికి సిద్ధమని మీరే పబ్లిక్‌గా ప్రకటించారు. ఇప్పుడు వెనక్కి తగ్గి బూతుల తో విరుచుకుపడుతున్నారు. నేను మిమ్మలని స్ట్రయిట్‌గా అడుగుతున్నా. ప్రభుత్వ ధర చెల్లించి ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడనికి సిద్ధమా? మీరు అక్రమంగా కొట్టేసిన భూములు వెనక్కి ఇవ్వడానికి సిద్ధమా? మీరు వందల ఎకరాలకు అధిపతి అయ్యారు. బెంజ్ కారులో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ జిల్లాలో ఉన్న ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఒక్క ఎకరం భూమి కొనే స్థితిలో ఉందా? అధికారంలో ఉంది మీరు.. ప్రతిపక్షంలో ఉంది మేము అని గుర్తించి ఆరోపణలు చెయ్యగలరని ఆశిస్తున్నా’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.