రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు సీఎం వైయస్ జగన్ ప్రతినిధులుగా ఇంటింటికీ వెళ్తున్నారు. సంక్షేమ పాలనను వివరిస్తూ ప్రజాసర్వే చేపట్టి.. వారి అనుమతి మేరకు ఇంటింటికీ `మా నమ్మకం నువ్వే జగన్` స్టిక్కర్లు అంటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైయస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయం తీసుకుంది.