నయవంచకుడు చంద్రబాబు మరో కపట నాటకానికి రెడీ అయ్యారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. తోడబుటిన వాడిని గదిలో బంధించిన వ్యక్తి ఆయన అని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలు చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. వంగవీటి రంగా, మల్లెల బాబ్జి ఎలా చనిపోయారో అందరికీ తెలుసు అన్నారు. త్వరలోనే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు.