మైనారిటీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ముస్లిం, దూదేకుల సోదరుల కుటుంబాలకు పంపిణీ చేయనున్న రంజాన్ తోఫాకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డులోని రజాక్ ఫంక్షన్ హాల్ లో సరుకుల ప్యాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు స్వయంగా వెళ్లి ప్యాకింగ్ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి అన్ని మండలాలకు పంపించాలని ఎమ్మెల్యే సూచించారు. మండలాల నుంచి మన పార్టీ నాయకులు, వాలంటీర్ల ద్వారా ముస్లింల ఇళ్లకు తోఫా సరుకులు చేరవేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ప్రక్రియను సాయంత్రం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు ప్యాకింగ్ పూర్తయిన సరుకులను కనగానపల్లి, రామగిరి, చెన్నైకొత్తపల్లి మండలాలకు పంపించారు. మధ్యాహ్నం నుంచి ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాలకు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.