శ్రీసత్యసాయి జిల్లాలో ఆమడగూరు మండలం తుమ్మకు చెందిన సుజాత కదిరి ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఆసుపత్రిలో వైద్య నిపుణులు డాక్టర్ ప్రత్యూష, సిబ్బంది సుజాతకు పురుడు పోశారు. 4.5 కిలోల బరువుతో శిశువుకు జన్మనిచ్చింది. సాధారణ కాన్పు తర్వాత తల్లి, బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. సుజాతకు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సాధారణంగా శిశువులు పుట్టే సమయంలో 2 కిలోల నుంచి 3.5 కిలోల వరకు బరువుతో ఉంటారు. అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టడం అరుదే అంటున్నారు. గతంలో కూడా అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు కిలోల బాబు జన్మించాడు. ధర్మవరానికి చెందిన మహిళకు తొలి కాన్పులో నాలుగు కిలోల బాబుకు జన్మనిచ్చా రు. డాక్టర్ల పర్యవేక్షణలో సాధారణ ప్రసవం జరిగింది. అంతేకాదు రెండేళ్ల క్రితం భద్రాద్రిలో కూడా ఓ శిశువు ఐదు కిలోల బరువుతో బిడ్డకు పాల్వంచకు చెందిన మహిళ జన్మనిచ్చింది. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు మొదటి కాన్పులోనూ పుట్టిన బాబు కూడా నాలుగున్నర కిలోల బరువు ఉన్నాడు.