గుంటూరు రైల్వే డివిజన్ కు 31 మంది స్టేషన్ మాస్టర్లను కేటాయించారు. వీరంతా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఎంపికయ్యారు. గత నాలుగు నెలల నుంచి శిక్షణలో ఉన్నారు. వీరందరినీ డివిజన్ పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లకు కేటాయిస్తూ శుక్రవారం ఏపీఓ బాలునాయక్ ఉత్తర్వులిచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి స్టేషన్ మాస్టర్ లేక ఉన్న వారి పైనే పని భారం పడింది. కొత్తవారు వచ్చినందున అన్ని స్టేషన్లకు సర్దిబాటు ఏర్పాటు చేశారు.