చిల్లపేటరాజాం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి కొంతల మణికంఠ 2 సంవత్సరాల క్రితం టిసిఎస్ కంపెనీ నిర్వహించిన వ్యాస రచన పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి కార్యాలయాన్ని సందర్శించి ఇటీవల మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా. శనివారం చిల్లపేట రాజాంలోని వారి స్వగృహమునకు వెళ్లి మణికంఠను అభినందించి చిరు సత్కారం చేసి, వారి తల్లితండ్రులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలియజేసారు. చదవులో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్న మణికంఠను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.