పాఠశాలలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందని మచిలీపట్నం డీఈవో తాహెరాసుల్తానా అన్నారు. రుస్తుం బాద ఉన్నత పాఠశాల హాలులో శుక్రవారం జిల్లా పరిషత్, మునిసిపల్, మండల పరిషత్, ప్రభుత్వ ఉన్నత, యూపీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాలల పని తీరు, ప్రగతి అంశాలపై బేరీజు, సామాజిక అంశాల తనిఖీలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. రీ వాల్యుయేషన్ టూర్ సర్వే రిపోర్టును యాప్‌లో పూరించాలన్నారు. గ్రంథాలయాల్లోని పుస్తకాలను విద్యార్ధులతో చదివించాలన్నారు. పాఠశాల భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇంజనీర్ల సాయం తీసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ.శేఖర్ అన్నారు. ఎంఈవో ఎం.వి.ఎస్. దుర్గాప్రసాద్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి గోపాల్, రిసోర్సు పర్సన్ కె.శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు.