ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సభ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. అనధికార స్థలంలో బహిరంగ సభ నిర్వహించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. షెడ్యూల్ ప్రకారం రాళ్లవాగు వద్ద చంద్రబాబు సభ నిర్వహించాల్సి ఉంది. అయితే చీకటి పడుతుండడంతో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కారణంగానే చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.