దుగ్గిరాల జడ్పీటీసీ భర్త దాసరి వీరయ్య ఈ నెల18వ తేదీ రాత్రి సమయంలో మంగళగిరి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త, బీసీ నాయకులు నందం అబద్దయ్యకు ఫోన్ చేసి మీరు, పోతినేని శ్రీనివాసరావులు ఎప్పుడైనా దుగ్గిరాల వస్తే మార్గ మధ్యలో ఉన్న మద్రాసు కాలవలోకి తోసి తొక్కి చంపుతా అని బెదిరించి, విషపూరితమైన వ్యాక్యలు చేసి అసభ్యకరంగా దూషించారు. ఈ మేరకు శనివారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో నాయకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు.
సదరు ఎమ్మెల్యే అనుచరుడు గతంలో విజయవాడలో సంచలనం సృస్టించిన సుభ్రమణ్యం అలియాస్ సుబ్బు మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్న కేసుకు సంబంధించిన క్రైం నెంబర్ వివరాలను కూడా పోలీసులకు సమర్పించారు. అజాతశత్రువు అయిన నందం అబద్దయ్యను ఎమ్మెల్యే అనుచరుడు బెదిరించడం పట్ల పలువురు బీసీ నాయకులు మండిపాడ్డారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారధి, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, రాష్ట్ర పద్మశాలి సాధికార సమితి సభ్యులు వూట్ల శ్రీమన్నారాయణ, రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పొలుమట్ల ప్రేమ్ కుమార్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షులు పొట్లబత్తుని లక్ష్మణరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.