పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల ఆహ్వానం మేరకు మాయాబజార్ లోని వారి గృహానికి వెళ్ళిన ప్రజాప్రతినిధులు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా శుభకాంక్షలు తెలియజేశారు. అనంతరం తేనీటి విందు స్వీకరించి పేదలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ లో కావటి శివ నాగ మనోహర్ నాయుడు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, కార్పొరేటర్ ఐసెట్టి కనకదుర్గ శ్రీనివాస్, వైయస్సార్సీపి మైనారిటీ నాయకులు షేక్ షౌకత్, వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, వైయస్సార్సీపి ముఖ్య నాయకులు, యువజన నాయకులు, ముస్లిం యువకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.