మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో చక్కెర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు, ఓ ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ట్రక్కు క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది.