మట్టి కుండ అంటేనే చల్లదనానికి మారుపేరు. దీంతో చలివేంద్రాల్లో ఎక్కడ చూసినా మట్టి కుండలే కన్పిస్తాయి. ప్రస్తుతం దంచికొడుతున్న మండుటెండల్లో మట్టి కుండల్లోని నీళ్లు తాగితేనే ఉపశమనం, వేసవి తాపం తీరుతుంది. కుండ నీళ్లతో వక్రియ మెరుగపడి పొట్టకు ఇబ్బంది లేకుండా చేస్తాయి. అలాగే ఆల్కలీన్ లక్షణాలు నీటిలోని పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. అంతేగాకుండా ఖనిజాలు, లవణాలు కూడా అందుతాయని నిపుణులు చెబుతారు.