చిత్తూరు జిల్లా, గూడూరు మండలం నెర్నూరులో ఒక విషాద సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... .. గూడూరు గాంధీనగర్ గిరిజనకాలనీకి చెందిన నాగరాజుకు సొసైటీ గిరిజనకాలనీకి చెందిన శ్రావణి (26)తో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య వివాదాలు తలెత్తడంతో భర్త నుంచి విడిపోయి నెర్నూరు గ్రామంలోని ఓ పొలానికి కాపలాదారుగా శ్రావణి చేరింది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు ఆదివారం రాత్రి నెర్నూరుకెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆమె మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.