అతిక్ అహ్మద్.. ఉత్తరప్రదేశ్‌లో చాలా ఫేమస్ గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటీషియన్. ఆయన్ను ప్రయాగ్ రాజ్‌లో పోలీసులు, మీడియా ప్రతినిధులు చూస్తుండగానే.. ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. అతని సోదరుడు కూడా ఈ కాల్పుల్లో చనిపోయాడు. అంతకు రెండ్రోజుల ముందే.. అతిక్ రెండో కుమారుడు అసద్ పోలీసులు ఎన్ కౌంటర్లో చనిపోయాడు. వీరి మరణం తర్వాత యూపీలోని చాలా చోట్ల ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి. అసద్ పోలీసుల ఎన్ కౌంటర్లో చనిపోయిన తర్వాత.. అతని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌లో వీడియోలు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. 2021లో ఓ యువకుడిని బంధించి బట్టలు ఊడదీశారు. తర్వాత అతన్ని బెల్టుతో కొట్టారు. ఈ వీడియోలో అసద్, అతని అనుచరులు ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెజ్లింగ్ చీఫ్ లైంగిక వేధింపులు.. క్రీడాకారులు ఆందోళన
కేవలం ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా వీడియోలు బయటకు వస్తున్నాయి. అసద్ ఎన్ కౌంటర్ తర్వాత చాలా మంది బయటకు వచ్చి.. వారి ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇటీవల ఓ యువకుడు ఓ వీడియోను విడుదల చేశాడు. దాంట్లో.. అసద్ తన అనుచరులు వచ్చి.. తాను ఉంటున్న ఇంటిని, స్థలాన్ని కబ్జా చేశారని.. అడ్డు వచ్చినందుకు విపరీతంగా కొట్టారని వివరించాడు. అప్పుడు పోలీసులు కూడా అక్కడే ఉన్నారని చెప్పాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అసద్ ఎన్ కౌంటర్ ఘటనలో అప్పుడు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను పోలీసులకు చిక్కకుండా పక్కా ప్లాన్‌తో రెండు నెలలు తప్పించుకున్నాడు. కానీ.. చిన్న మిస్టేక్ అతన్ని పట్టించి.. ఎన్‌కౌంటర్ అయ్యేలా చేసింది. అతిక్ అహ్మద్ గ్యాంగ్‌లో ఓ వ్యక్తిని పోలీసులు తమకు ఇన్‌ఫార్మర్‌గా మార్చుకున్నారు. అతను అసద్ ఆచూకీ గురించి నిరంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే.. అసద్ ఝాన్సీ వచ్చాడు.
ఈ విషయం తెలిసి.. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ఝాన్సీ నగరంలోని పలు ప్రదేశాలపై నిఘాపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో అసద్.. పాల్ హత్య కేసులో సహ నిందితుడు గులామ్‌తో కలిసి అసద్ మధ్యప్రదేశ్‌కు బైక్‌పై బయలుదేరారు. వీరిని గుర్తుపట్టకుండా మారువేషం వేసుకున్నారు. కానీ.. పోలీసులు వారిని గుర్తించి ఆపే ప్రయత్నం చేశారు. లొంగిపోవాలని సూచించారు. కానీ.. వారు కాల్పులు ప్రారంభించారు. చేసేదేం లేక.. పోలీసులు కూడా ఫైర్ స్టార్ చేశారు. ఈ ఎన్ కౌంటర్‌లో అసద్, అతని సన్నిహితుడు గులామ్ హతమయ్యారు.