తిరుమలలో నేడు (మంగళవారం) భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం కేవలం ఒక్క కంపార్ట్‌మెంటులో మాత్రమే వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం స్వామివారిని 63,870 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 27,480 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు రూ.300 స్పెషల్ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో మే, జూన్ నెలల టికెట్లను విడుదల చేయనుంది.