ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని EMSC వెల్లడించింది. భయంతో చాలామంది తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు అధికార ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. అయితే, భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం సంభవించలేదన్నారు. మొదట భూకంపం ద్వార సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేయగా.. తర్వాత ఉపసంహరించుకున్నారు.