పాకిస్థాన్‌లో మరోసారి బాంబుల మోత మోగింది. స్వాత్ జిల్లాలోని ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) పోలీస్ స్టేషన్ లక్ష్యంగా బాంబుదాడి జరిగింది. సోమవారం రాత్రి జరిగిన జంట పేలుళ్లలో పది మంది పోలీసులతో సహా 13 మంది మరణించారు. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. ఉగ్రవాది కూడా తనను తాను పేల్చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.