ఢిల్లీలోని 13 లక్షల మంది నిర్మాణ కార్మికులపై కేజ్రీవాల్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. నిర్మాణ కార్మికులకు ఢిల్లీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్రూప్ ఇన్సూరెన్సు, హాస్టళ్ల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. 75% రాయితీపై ఇళ్లనూ అందించనుంది. సోమవారం దిల్లీలో కార్మికశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయాలను ప్రకటించారు. 60ఏళ్లు దాటిన కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు.