మహారాష్ట్ర పూణే సతారా హైవే సమీపంలోని పెట్రోల్ బంకులో ఓ ట్రక్కు అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. సరిగ్గా పెట్రోల్ బంక్ ఎంట్రన్స్ లోకి వస్తుండగా ట్రక్కు అదుపు తప్పడంతో ఓ కారును ఢీకొట్టి, పెట్రోల్ బంక్ పంపు వైపునుకు దూసుకొచ్చింది. ఈ ఘటన శనివారం జరగ్గా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa