UP CM యోగీ ఆదిత్యానాథ్కు ఓ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. లక్నోలోని ఓ గుర్తు తెలియని వ్యక్తి 'డయల్ 112' ద్వారా సీఎం యోగీని త్వరలోనే చంపేస్తానంటూ సందేశం పంపాడు. దీంతో ఆపరేషన్ కమాండర్ అధికారులు అప్రమత్తమై ఆ గుర్తు తెలియని నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఆదివారం ప్రధానికి కూడా బెదిరింపు సందేశం రాగా, వెంటనే అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో మోదీకి భద్రత ఏర్పాట్లు చేశారు.