చేబ్రోలు గ్రామంలోని భవితా కేంద్రంలో సోమవారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వినికిడి యంత్రాలను మండల విద్యాశాఖ అధికారి జే ఏఎస్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ వారి ఆధ్వర్యంలో ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి 10వేలువిలువ చేసే యంత్రాలను ఉచితంగా అందజేయటం హర్షణీయమన్నారు. పుట్టుకతో పూర్తిగా మాటరాని, మూగ, వినికిడి లోపం కలిగిన విద్యార్థులు వినికిడి యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్ఎం వినోద్ కుమార్, భవిత కేంద్రంలోని ఉపాధ్యాయురాలు జి అనురాధ, రాజేష్, పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.