అనంతపురం జిల్లా కేంద్రంలోని టిసిపిసి సెంటర్లో జిల్లా వ్యాప్తంగా మంజూరైన ట్రై స్కూటర్స్ ను విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్, జిల్లా కలెక్టర్ గౌతమి మరియు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వారిలో మరింత ఆత్మస్థైర్యంను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేయడం జరిగింది. కావున అర్హులైన ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.