ఆఫ్రికా దేశం సూడాన్‌లో భారతీయులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్.. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సూడాన్ నుంచి తిరిగొచ్చే వారి కోసం విమాన టికెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకుని, అక్కడి నుంచి వారు తమ స్వస్థలాలకు చేరుకునే వరకు అధికారులు అండగా నిలవాలని పేర్కొన్నారు.