ఢిల్లీలోని ఓ ప్రముఖ ఫాఠశాలకు బాంబు బెదిరింపులు రావటం తీవ్ర కలకలం రేపింది. బుధవారం మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈ- మెయిల్ వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ అందులో పేర్కొనడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. సిబ్బంది, విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపించింది. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa