దళితుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని నెల్లూరు జిల్లా, టీడీపీ నాయకులూ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. విడవలూరు మండలంలోని ఊటుకూరు పంచాయతీలో దళిత రైతుల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు పంపిణీ చేసిన 91 ఎకరాల భూముల వద్ద మంగళవారం దినేష్‌రెడ్డి సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన భూముల్లో ఈ నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో మౌలిక వసతులు లేక సాగు చేసుకోలేదన్నారు. వారికి ఎందుకు వసతి కల్పించలేక పోయారో తెలపాలని డిమాండ్ చేశారు. అలాగే ఏ ఒక్క దళిత రైతుకైనా సెంటు భూమి ఇచ్చారా అని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, చెముకుల శ్రీనివాసులు, మాతూరి శ్రీనివాసులురెడ్డి, సత్యవోలు సత్యంరెడ్డి, కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, రావెళ్ల వీరేంద్ర, ఇంతా మల్లారెడ్డి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.