దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయని మాజీ ప్రధాని, JD(S) అధిపతి హెచ్‍డీ దేవగౌడ అన్నారు. ఈ తరహాలో TS సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీలతో నిరంతరం చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థుల తరపున ప్రచారానికి కేసీఆర్ కూడా వస్తారన్నారు. మాజీ సీఎం కుమారస్వామితో BRS నేతలు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. కర్ణాటకలో పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వస్తామన్నారు.