లోన్ యాప్ ల దారుణాలు పెరిగిపోతుండడంతో గూగుల్ ప్లే స్టోర్ లోన్ యాప్ పై కొరడా ఝలిపించింది. ఒక్క భారత్ లోనే 3,500 లోన్ యాప్ లపై చర్యలు తీసుకుంది. బ్యాడ్ యాప్స్, డేటా ఆన్ లోన్ యాప్స్ పై గూగుల్ విడుదల చేసిన నివేదికలో వివరాలు ఉన్నాయి. అలాగే గూగుల్ ఫైనాన్షియల్ యాప్స్ కు సంబంధించి తమ విధానాలను సవరించింది. ఫైనాన్షియల్ యాప్ నిర్వాహకులు ఆర్బీఐ నుండి లైసెన్స్ పొంది ఉండాలని నిబంధన విధించింది.