మహిళపై ఆటో డ్రైవర్,అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వరంగల్ లో జరిగింది. నయీంనగర్ కు చెందిన వివాహిత ఈనెల 27న రాత్రి 12 గంటల సమయంలో ఆటో ఎక్కింది. డ్రైవర్ రాకేశ్ తన స్నేహితులైన సనత్, సతీశ్ కు ఫోన్ చేశాడు. వారు రాగానే ఆటోను భీమారం వైపు తీసుకెళ్లి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రంగ్ బార్ వద్ద వదిలేసి పారిపోయారు. వివాహిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.