విజయవాడ నగరంలోని మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ సెంటర్ (పాక ఇడ్లీ)లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టిఫిన్ చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ తిన్నారు. ఈ ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు. నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... పాక ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని గుర్తుచేశారు. నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa