టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా కోడుమూరులో యువగళం పాదయాత్రను నిర్వహిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా లోకేష్‌ని కలిసేందుకు వచ్చిన యువత, మహిళలు, వృద్దులను కలిసి నారా లోకేష్ సమస్యలు తెలుసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. పన్నులు విపరీతంగా పెంచేశారని స్థానికులు లోకేష్ వద్ద వాపోయారు. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నామని యువకులు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.