అకాల వర్షాల కారణంగా రంగు మారిన పసుపు, నాణ్యత తగ్గిన మొక్కజొన్న ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జగన్‌కి లేఖ రాశారు. పసుపు ఎమ్మెస్పీ రూ.6,850 ఉంటే.. ఈ ఏడాది క్వింటాకు రూ.3,500-4,500 మాత్రమే అంటూ రైతుల్ని దగా చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో 3 వేల ఎకరాల్లో పసుపు పండిస్తే ప్రభుత్వం ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయలేదన్నారు. 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు దాటిపోయిందని, దిగుబడి తగిందన్నారు.